HomeTelugu Trendingమెగాస్టార్‌ తీసిన మొదటి ఫొటో..

మెగాస్టార్‌ తీసిన మొదటి ఫొటో..

Chiranjeevi shares the her
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నారు. వరుస పోస్ట్ లతో ట్విట్టర్ ను షేక్ చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న చిరంజీవి తనకు సంబంధించిన అనేక విషయాలను అందులో నెటిజన్లతో పంచుకుంటున్నాడు. ఈ మధ్యే అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట! అంటూ ఓ వంటని చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగాస్టార్. నేడు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో ఐదుగురు ఉన్నారు. దానికి ”నేను తీసిన మొదటి ఫొటో … ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు … చెప్పుకోండి చూద్దాం” అని అభిమానులను ప్రశ్నించాడు చిరు. కాగా ప్రస్తుతం చిరంజీవి కొరటాల డైరెఖక్షన్‌ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుండి చిరు ఫస్ట్‌లుక్ అలాగే మోషన్ పోస్టర్ రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu