HomeTelugu Big Stories'యశోద' మూవీ టీజర్‌ విడుదల

‘యశోద’ మూవీ టీజర్‌ విడుదల

Yashoda movie Teaser
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. ఇది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ యాక్షన్ థ్రిల్లర్. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.ఈ నేపథ్యంలో… ఈరోజు (సెప్టెంబర్ 9) టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా ఉంది. గర్భిణీ గా సమంత అద్భుతంగా నటించింది. యాక్షన్ సీన్స్ లోనూ ఆమె అదరగొట్టింది.

ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపించాడు. వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ , మురళీ శర్మ, కల్పిక గణేష్, సంపత్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu