HomeTelugu Trending'ఏపీ' సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రచారం.. అప్పుడే నేమ్ ప్లేట్ సిద్ధం!.. వైరల్‌

‘ఏపీ’ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రచారం.. అప్పుడే నేమ్ ప్లేట్ సిద్ధం!.. వైరల్‌

9 11ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఓవైపు చంద్రబాబునాయుడు ఈవీఎంల్లో అవకతవకలు అంటూ ఈసీ చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అంటూ తెలుగు, ఇంగ్లిష్‌లో రాసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఎన్నికల్లో వైసీపీ గెలుపు మీద ఆ పార్టీ ముందు నుంచి ధీమాగా ఉంది. ఈ క్రమంలోనే కేడర్‌లో మరింత ఉత్సాహం నింపేందుకు ‘కౌంట్ డౌన్’ క్లాక్ కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11 పోలింగ్ తేదీ నాటికి ఆ కౌంట్ డౌన్ పూర్తయ్యేలా క్లాక్ సెట్ చేశారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ దశలో వైసీపీది ఆత్మవిశ్వాసమా? అతి విశ్వాసమా అనే చర్చ కూడా మొదలైంది. అయితే, కేడర్‌లో మనోధైర్యం నింపేందుకు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయినట్టు రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి అంటూ నేమ్ బోర్డు కూడా రెడీ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఈనెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న రిలీజ్ కానున్నాయి. అప్పటి వరకు ఉత్సాహం ఆపుకోలేని వైసీపీ కేడర్ దీన్ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండవచ్చని భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu