Homeపొలిటికల్AP Politics: వైసీపీ నేతలు రాష్ట్రాన్ని ఇంకా ఎంత దిగజార్చుతారో?: షర్మిల

AP Politics: వైసీపీ నేతలు రాష్ట్రాన్ని ఇంకా ఎంత దిగజార్చుతారో?: షర్మిల

Sharmila
AP Politics: అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తించిన తీరు పట్ల ఏపీ కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.

రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారి ఏసీఏలో జరుగుతున్న రాజకీయాలను బయటపెట్టాడు. రాజకీయ నేతల జోక్యంతోనే ఈ ఏడాది రంజీ సీజన్‌ మధ్యలోనే తాను ఆంధ్ర జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నానని సోషల్‌ మీడియాలో సంచలన పోస్ట్‌ పెట్టాడు.

జట్టుకు సంబంధించిన విషయంలో ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ జరిగినందుకు ఏసీఏ పెద్దలు తనపై వేటు వేశారని ఆరోపించాడు. ఇది తనను ఎంతో వేదనకు గురి చేసిందనీ, భవిష్యత్‌లో ఆంధ్ర జట్టుకు ఆడేదే లేదంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తీరును రాజకీయ ప్రముఖులంతా ఖండించారు. హనున విహారికి అండగా ఉంటామని చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్ కల్యాణ్ అన్నారు. ఏసీఏ తీరు బాధాకరమని అన్నారు.

ఏపీలో వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారి.. ఏపీ తరఫున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని ఆరోపించారు. హనుమ విహారికి తాము అండగా ఉంటామని, అతనికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

‘హనుమ విహారి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆట పట్ల అతనికున్న చిత్తశుద్ధిని వైసీపీ కుట్రా రాజకీయాలు నీరు గార్చలేవు. అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ప్రోత్సహించరు.’ అని చంద్రబాబు అన్నారు.

మరో ‘2 నెలల్లో ఏపీ తరఫున తిరిగి ఆడడానికి హనుమ విహారి రావాలి. విహారి, అతని జట్టుకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతాం. ఆంధ్రా క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం అని లోకేశ్ తెలిపారు.

క్రికెటర్ హనుమ విహారిని వైసీపీ నాయకులు వేధించడంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్ఠను వైసీపీ నేతలు అన్నివిధాలుగా నాశనం చేశారని ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో ఊహించలేమని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు.. అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? అని ప్రశ్నించారు.

ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? అని వైసీపీ నేతలను షర్మిల దుయ్యబట్టారు. ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా? అని నిలదీశారు. ఈ వ్యవహారంపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని, నిస్పాక్షికమైన విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. క్రీడలు, క్రీడాకారుల విషయంలో వైసీపీ నేతల ఆగడాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu