HomeTelugu Trendingదుమ్ము లేపుతున్న యువరత్న ట్రైలర్

దుమ్ము లేపుతున్న యువరత్న ట్రైలర్

Puneet Rajkumar Yuva Ratna
విద్యాసంస్థల్లోని అవకతవకలను చూపిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం యువరత్న. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, సాయేషా జంటగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విద్యార్థులు డ్రగ్స్‌ బానిసలు అవుతున్న తీరును విద్యను వ్యాపారంగా చూస్తున్న కొన్ని విద్యాసంస్థల తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న పునీత్ పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ విడుదలైన కొద్ది క్షణాల్లోనే లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. సోనుగౌడ, ధనంజయ్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu