ఏనుగులతో రానా ఫ్రెండ్షిప్!

టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో రానా తన చిత్రాలతో ప్రత్యేకతను చాటుతుంటాడు. వైవిధ్యమైన కథను ఎన్నుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా రానా మరో ఆసక్తికర సబ్జెక్ట్ తో తెరకెక్కుతోన్న ‘హథీ మేరే సాథీ’ అనే సినిమాలో నటించడానికి అంగీకరించాడు. ఏనుగులకు, మనుషులకు మధ్య స్నేహమనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథ ప్రకారం సినిమాలో రానా ఏనుగులతో కలిసి నటించాల్సివుంది. సినిమా షూటింగ్ మొదలుకావడానికి ఇంకా కొన్ని రోజులు సమయం ఉండడంతో ఈలోగా రానా పది, పదిహేను రోజుల పాటు ఏనుగులతో సమయం గడపబోతున్నాడు.

దీనికోసం ఫారెస్ట్ టూర్ ప్లాన్ చేశాడు. ఈ నెలలో సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇరవై ఏనుగుల మధ్య థాయిలాండ్ అడవుల్లో సినిమా షూటింగ్ జరపనున్నారు. రానా ఏప్రిల్ నుండి షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.