ఐపిఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తారక్!

‘బిగ్ బాస్’ షోతో బుల్లితెర ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ బాగా దగ్గరైన నేపధ్యంలో ఈ షో సెకండ్ సిరీస్ కు మా టీవీ భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినా జూనియర్ తన సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా ‘బిగ్ బాస్’ సీజన్ 2కి దూరం అయ్యాడు. ఎన్టీఆర్ ను బుల్లితెర అభిమానులు చాల మిస్ అవుతున్నారు అని బాధ పడుతున్న నేపధ్యంలో జూనియర్ కు అనుకోని భారీ ఆఫర్ వచ్చింది. స్టార్ టీవీ ఈ ఏడాది స్పోర్ట్స్ ఈవెంట్స్ తో భారీ స్థాయిలో బిజినెస్ ను ప్లాన్ చేసుకుంటోంది.ఐపీఎల్ – ప్రో కబడ్డీ లీగ్ లకు ఆదరణ చాలా పెరుగుతున్న నేపధ్యంలో ఈరెండు ఈవెంట్స్ కు సంబంధించి తెలుగులో బుల్లి తెర పై ఈ ఈవెంట్స్ ప్రమోట్ చేయడానికి తెలుగు సైడ్ నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా తారక్ ని ఎంచుకోవడం ఇప్పడు టాపిక్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీనికి సంబంధించి స్టార్ టీవీతో భాగస్వామ్యం ఉన్న స్టార్ మా త్వరలో ఎన్టీఆర్ తో ప్రోమోస్ రెడీ చేయడానికి రెడీ అవుతోంది.