నవీన్ విజయ్ కృష్ణ జన్మదిన వేడుకలు!

సూపర్ స్టార్ కృష్ణ మనమడు, సీరియర్ హీరో టర్నడ్ ఆర్టిస్ట్ నరేష్ తనయుడు అయిన నవీన్ విజయ్ కృష్ణ పుట్టినరోజు వేడుకలు నేడు ఘట్టమనేని అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహింపబడ్డాయి. నటించిన ఒక్క సినిమాతోనే ఆర్టిస్ట్ గా తన ఉనికిని ఘనంగా చాటుకొన్న నవీన్ విజయ్ కృష్ణ ఇటీవలే 3 కొత్త సినిమాలు సైన్ చేశాడు. అతి త్వరలో వెల్లడికానున్న సదరు సినిమాల వివరాలను గురించి నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. “నా మొదటి సినిమా అయిన “నందిని నర్సింగ్ హోమ్”ను ప్రేక్షకులు ఆదరించడంతోపాటు.. విమర్శకులు నన్ను నటుడిగా గుర్తించి నాకు సపోర్ట్ అందించారు. హీరోగా సక్సెస్ అందుకొన్న తర్వాత జరుపుకొంటున్న మొదటి పుట్టినరోజు వేడుక ఇది. ఈమధ్యే మరో మూడు ప్రోజెక్టులు సైన్ చేశాను. మూడు వేటికవే వైవిధ్యంగా ఉంటాయి. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను. నన్ను హీరోగా లాంచ్ చేయడమే కాక నాకు హీరోగా మోరల్ సపోర్ట్ ను కూడా అందిస్తున్న మా తాతగారు కృష్ణగారు, నానమ్మ విజయనిర్మల గార్లకి నా ధన్యవాదాలు. త్వరలో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తాను. మునుపటి చిత్రానికి అందించినట్లే నా తదుపరి సినిమాలకు కూడా వారి సపోర్ట్ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు!