కాజల్ కు డైరెక్టర్ వార్నింగ్!

కాజల్ కు డైరెక్టర్ వార్నింగ్!
అందాల తార కాజల్ కు ఓ డైరెక్టర్ వార్నింగ్ ఇచ్చాడనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు 
విషయంలోకి వస్తే.. కాజల్ కు ప్రస్తుతం ఫ్లాప్స్ ఉన్నా.. సరే అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. తమిళంలో 
రెండు సినిమాకు సైన్ చేసింది. మెగాస్టార్ 150 సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలానే ఎన్టీఆర్ సినిమాలో 
ఐటెమ్ సాంగ్ చేస్తోంది. అయితే అజిత్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న కాజల్ ఆ సినిమా కోసం 
మొన్నమధ్య యూరప్ వెళ్లింది. ఈ చిత్రాన్ని శివ డైరెక్ట్ చేస్తున్నారు. కాజల్ కు ట్విటర్ లో తన విషయాలను షేర్ చేసుకోవడం అలవాటు. తన సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. అలానే ఈ సినిమా గురించి పోస్ట్ పెట్టి తన లుక్స్ ను షేర్ చేసింది. దీంతో డైరెక్టర్ కాజల్ ను పిలిచి పెద్ద క్లాస్ తీసుకున్నాడట. నిజానికి ఈ సినిమాలో కాజల్ లుక్ ను సీక్రెట్ గా ఉంచాలనేది శివ ఆలోచన. కానీ కాజల్ మాత్రం ట్విటర్ ద్వారా రివీల్ చేసెసింది. దీంతో ఇంకెప్పుడూ ఇలా 
చేయొద్దని కాజల్ కు వార్నింగ్ ఇచ్చాడట. 
CLICK HERE!! For the aha Latest Updates