కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త చిత్రం

కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త చిత్రం
 ఉత్తమ చిత్రాలను అందించాలనే ఆసక్తితో, సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బలగ ప్రకాష్ నిర్మాతగా వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై ఓ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. అంతర్వేది టు అమలాపురం చిత్రంలో నటించిన హీరో, సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కేటుగాడు వంటి డిఫరెంట్ చిత్రంతో అందరి మన్ననలు అందుకున్న దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వచ్చే నెలలో సినిమా లాంచనంగా ప్రారంభం కానుంది. త్వరలోనే  ఈ చిత్రంలో నటించనున్న మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తామని పుట్టినరోజు(ఆగస్ట్ 12) సందర్భంగా నిర్మాత బలగ ప్రకాష్ తెలియజేశారు.