తేజుకి, అల్లు అరవింద్ ఛాన్స్ ఇవ్వట్లేదు!

తేజుకి, అల్లు అరవింద్ ఛాన్స్ ఇవ్వట్లేదు!
పక్కా కమర్షియల్ ఫార్మాట్ సినిమాల్లో నటిస్తూ.. సేఫ్ జర్నీ చేస్తున్నాడు హీరో సాయి ధరం తేజ్. 
ప్రస్తుతం ఆయన నటిస్తున్న తిక్క సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు 
బాబు బంగారం సినిమాతో గట్టి పోటీ ఉంది. ఇది కాదు అన్నట్లు సొంత ఫ్యామిలీ నుండి తేజుకి మరొక 
సమస్య ఎదురవుతుంది. తిక్క సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి థియేటర్స్ దొరకడం 
లేదని తెలుస్తోంది. నిజానికి ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా విడుదలయ్యి వారం రోజులు గడుస్తుంది. 
తిక్క కోసం ఈ సినిమాను థియేటర్స్ నుండి తీయాల్సిన పరిస్థితి కలిగింది. అయితే దానికి అల్లు 
అరవింద్ అడ్డు పడుతున్నాడు. కొడుకు సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి థియేటర్స్ లాక్ 
చేసేశాడు. దిల్ రాజు అండర్ లో ఉన్న థియేటర్లపై కూడా ఈయనే అజమాయిషీ చెలాయిస్తున్నాడు. 
ఈ విషయమై తేజు, అల్లు అరవింద్ తో మాట్లాడానికి ప్రయత్నించినా.. లాభం లేకుండా పోయిందని 
చెబుతున్నారు.