తేజు ఇక రూట్ మార్చాల్సిందే!

మొదట్లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సాయి ధరం తేజ్ ఇప్పుడు మాత్రం వరుస ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రొటీన్ కథలను ఎన్నుకోవడం, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. స్టార్ డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వడంతో ఆలోచించకుండా కథలు ఎన్నుకొని ఫ్లాప్ సినిమాల్లో నటించాడు. వరుసగా ఐదు డిజాస్టర్లు అందుకున్నాడు. పైగా ప్రతి సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ఇమిటేట్ చేస్తూ మరింత విసిగిస్తున్నాడు. మెగాస్టార్ సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేస్తూ వాటిని స్థాయిని తగ్గిస్తున్నాడు.
ఆ పాటల రీమిక్స్ వలన ధరం తేజ్ సినిమాకు పనికొచ్చేదేమీ లేకపోవడం పక్కన పెడితే అది నెగెటివ్ గా మారి ప్రభావం చూపుతోంది. తేజుతో పాటు ఇండస్ట్రీకు వచ్చిన వరుణ్ తేజ్ మాత్రం తనకు సూట్ అయ్యే కథలను ఎన్నుకుంటూ ఒక్కో హిట్ ను అందుకుంటూ వెళ్తున్నాడు. కానీ తేజు పరిస్థితి అలా లేదు. ఇకనైనా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మెగాఫ్యామిలీలో ఫ్లాప్ హీరోగా తేజు పేరు ఉండడం ఖాయం.