నాని, బన్నీలలో హోస్ట్ చేసేదెవరు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ సీజన్1 ను తనదైన టైమింగ్ తో రసవత్తరంగా నడిపించారు. రెండో సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఆయన త్రివిక్రమ్, రాజమౌళి వంటి దర్శకులతో సినిమాలకు కమిట్ అవ్వడం, అలానే వ్యక్తిగతంగా కూడా తారక్ చేయాల్సిన కొన్ని పనులు ఉండడంతో ఆయన బిగ్ బాస్2 ను హోస్ట్ చేసే ఛాన్స్ లేదని అంటున్నారు. తారక్ లేకపోతే ఈ షోను ఎవరు నడిపిస్తారనే విషయంలో ఇద్దరు హీరోల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాగా, మరొకరు నేచురల్ స్టార్ నాని. తన నటనతో లక్షలాది మందిని అభిమానులుగా మార్చుకున్న బన్నీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చే అవకాసం లేకపోలేదని అంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా బిగ్ బాస్ నిర్వాహకులు బన్నీను కన్సిడర్ చేస్తున్నారు. మరోపక్క నానికి కూడా స్టార్ హీరోలకు తీసిపోని క్రేజ్ ఉంది. తన కామెడీ టైమింగ్, మాటలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికే కొన్ని ఈవెంట్స్ ను హోస్ట్ చేసి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఈ దిశగా నానిని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి!