HomeTelugu NewsTollywood Young Heroes: వీరి సక్సెస్‌ సీక్రెట్‌ ఏమిటో తెలుసా!

Tollywood Young Heroes: వీరి సక్సెస్‌ సీక్రెట్‌ ఏమిటో తెలుసా!

Tollywood Young Heroes

Tollywood Young Heroes: టాలీవుడ్‌ స్టార్ హీరోలలో చాలామంది రెండేళ్లకు, ఐదేళ్లకు ఒక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. వీరి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు ఉంటారు. మిడిల్ రేంజ్ హీరోలు వేగంగానే సినిమాల్లో నటిస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నారు. అయితే ఇప్పటి యంగ్ హీరోలు మాత్రం పూర్తిగా విభన్నం.

యంగ్‌ హీరోలు మాత్రం సరైన కథ, కథనం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. తక్కువ పారితోషికం తీసుకుంటూ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు వచ్చేలా చేస్తున్నారు. ఒక విధంగా ఈ హీరోల సక్సెస్ సీక్రెట్ అని చెప్పవచ్చు.

Tollywood 1 Tollywood Young Heroes,Teja Sajja,Aguti Shesh,Siddhu Jonnalagadda

సిద్ధు జొన్నలగడ్డ కూడా ఈ కోవలోకే వస్తాడు.. ‘డీజే టిల్లు’ మూవీతో యూత్‌ని ఆకట్టుకున్న సిద్ధు.. టిల్లు స్క్వేర్.. తన ఖాతాలో మరో హిట్‌ని వేసుకున్నాడు. ఈ సినిమాతో ఆయనకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమాలో సిద్ధు డైలాగ్‌ డెలివరీ, నటనతో ప్రేక్షకులు బాగా మెప్పించాడు. వరుస విజయాలతో సిద్ధు జొన్నలగడ్డ ఇమేజ్ మారిపోయిందని చెప్పవచ్చు. తన సినిమాలకు తనే కథ రాసుకుంటూ సిద్ధు జొన్నలగడ్డ సక్సెస్ సాధించారు.

యంగ్ హీరో తేజ సజ్జాకు కూడా వరుస విజయాలు దక్కుతున్నాయి. జాంబిరెడ్డి సినిమాతో మంచి సక్సెస్‌ అందుకున్న తేజ.. మరోసారి ఆ మూవీ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతోనే సినిమా చేశాడు. ‘హనుమాన్’ ఈ సినిమా తేజ కెరీయర్‌నే మార్చేసింది అని చెప్పవచ్చు. ఈ సినిమాల తరువాత తేజ సజ్జా కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తాజాగా మిరాయ్ సినిమాలో సూపర్ యోధుడిగా తేజ సజ్జా కనిపించనున్నారు.

Tollywood 2 1 Tollywood Young Heroes,Teja Sajja,Aguti Shesh,Siddhu Jonnalagadda

మరో టాలెంటెడ్ హీరో అడివి శేష్ కూడా హెచ్చులకు పోకుండా.. సరైన కథలు ఎంచుకుంటూ తన స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్2, మేజర్ లాంటి సినిమాలతో విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం గూఢచారి సీక్వెల్, డెకాయిట్ సినిమాలలో శేష్ నటిస్తున్నారు.

నవీన్ పోలిశెట్టి తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. జాతిరత్నాలు సక్సెస్ నవీన్ కెరీర్‌కు ప్లస్‌ అయింది. ఇటీవలే మిస్‌ శెట్టి, మిసెస్‌ శెట్టిలో కూడా తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు.

మరో యంగ్, టాలెంటెడ్ హీరో సుహాస్ కూడా వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. కలర్‌ ఫోటో, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Tollywood 3 1 Tollywood Young Heroes,Teja Sajja,Aguti Shesh,Siddhu Jonnalagadda

కథ బాగుంటే చాలు.. హీరోలు.. భారీ బడ్జెట్‌లు అవసరం లేదు. అనే సిద్ధాంతంతో అడుగు వేస్తున్నారు ఈ హీరోలు.. ఈ హీరోల సక్సెస్ రేట్ అంతకంతకూ పెరగడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ టాలీవుడ్ హీరోల రేంజ్ రాబోయే రోజుల్లో ఎంతో పెరగాలని ఇతర భాషల్లో సైతం ఈ హీరోలు సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu