బస్సెక్కుతూ కనిపించిన అనుష్క!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ప్రాధాన్యత గల పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కొంత మంది హీరోయిన్లు. ఇలాంటి సమయంలో కొంత మంది హీరోయిన్లు మాత్రం గ్లామర్ కి కాకుండా నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. అనుష్క, సమంత లాంటి హీరోయిన్లు డి గ్లామర్ పాత్రలకు సైతం ఒప్పుకుంటున్నారు. బాహుబలి సినిమాలో అనుష్క డీ గ్లామర్ గా కనిపించిన విషయం తెలిసిందే.రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా సమంత ఓ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది. ఇలా టాప్ హీరోయిన్లు అయి ఉండి కూడా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌ లో భోపాల్‌ లోని హలాల్‌ పుర్ బస్టాండ్‌ లో నటి అనుష్క శర్మ సాధారణ చందరీ చీరను ధరించి బస్సెక్కుతూ కనిపించింది. వరుణ్ ధావన్, అనుష్క శర్మ జతగా ‘సూయి ధాగా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చందేరీ చీరల తయారీలో కష్టనష్టాలను చూపిస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ థీమ్‌ తో ఈ సినిమా రూపొందుతోంది.