బాలయ్య పాత్రలో మోక్షజ్ఞ!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వచ్చే ఏడాది సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే విషయాన్ని స్పష్టం చేశారు బాలయ్య. దీంతో ఆయన ఎలాంటి కథతో పరిచయం కాబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఎన్ఠీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ నటించబోతున్నాడని మాటలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఎన్ఠీఆర్ బయోపిక్ ను రూపొందిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఎన్ఠీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తారని సమాచారం. అయితే కథలో ఎన్ఠీఆర్ తనయుడు బాలయ్య పాత్ర కూడా ఉంటుందట. దానికోసం మోక్షజ్ఞ అయితే ఎలా ఉంటుందనే చర్చలు జరుగుతున్నాయి. అదే గనుక నిజమైతే నందమూరి అభిమానులకు ఇదొక పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో.. తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!