రకుల్ ప్రీత్ సినిమాకు కట్స్‌ చెప్పిన సెన్సార్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సీనియర్ హీరో అజయ్‌ దేవగన్‌కు జోడిగా ‘దే దే ప్యార్‌ దే’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమాకు సెన్సార్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారట. ఓ పాటలో రకుల్ ప్రీత్‌ సింగ్‌ విస్కీ బాటిల్‌ పట్టుకొని డ్యాన్స్‌ చేయటంపై సెన్సార్‌ బోర్డ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ సీన్‌ను కట్ చేయటం లేదా..? బాటిల్‌ కు బదులుగా పూలు పట్టుకున్నట్టుగా గ్రాఫిక్స్‌ చేయాలని సూచించారట. మరికొన్ని కట్స్‌తో సినిమాకు
యు/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అకీవ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టబు మరో కీలక పాత్రలో నటిస్తోంది.