రోహిత్ ఇంక తగ్గడేమో!

రోహిత్ ఇంక తగ్గడేమో!
బాణం, సోలో, అసుర, ప్రతినిధి ఇలా ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించే నారా రోహిత్ తన లుక్ 
విషయంలో మాత్రం ఎలాంటి మార్ప్లులు చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం ఉన్న హీరోలంతా బాడీ 
ఫిట్ గా సిక్స్ ప్యాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటే రోహిత్ మాత్రం రోజురోజుకి బరువును పెంచే పనిలో 
ఉన్నట్లున్నాడు. రీసెంట్ గా విడుదలయిన సావిత్రి, తుంటరి చిత్రాల్లో రోహిత్ లుక్ పై చాలా మంది 
కామెంట్స్ వేశారు. రివ్యూలలో సైతం రోహిత్ తగ్గితే బావుంటుందని రాశారు. ఈ విషయాలు రోహిత్ 
చెవిన చేరడంతో తన నెక్స్ట్ సినిమాలో కచ్చితంగా బరువు తగ్గుతానని ప్రకటించాడు. ఒకానొక సంధర్భంలో సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తున్నా.. అని చెప్పడంతో రోహిత్ తన లుక్ మార్చుకుంటున్నాడని అందరూ 
భావించారు. కానీ రీసెంట్ గా విడుదలయిన ‘జ్యో అచ్చ్యుతానంద’ సినిమా టీజర్ లో నారా రోహిత్ 
ఎప్పటిలానే లావుగా కనిపిస్తున్నాడు. దీంతో నారా వారబ్బాయికి తగ్గే ఆలోచనే లేనట్లుందని 
సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
CLICK HERE!! For the aha Latest Updates