లోకేష్ ఆ జిల్లా నుంచే.. పోటీచేసేది అందుకేనా?

బాలయ్య అల్లుల్లు గిల్లుడు మొదలు పెట్టారా.? లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం రెండో అల్లుడు భరత్ ను సైడ్ చేస్తున్నారా.? టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిస్థితి అలానే ఉందన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కుమారుడు, మంత్రి లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడాలని రెడీ అయ్యారట.. ఇప్పటికే దొడ్డిదారిన తండ్రి ప్రోద్బలంతో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని లోకేష్ బాబు రంగం సిద్ధం చేసుకున్నారు.

లోకేష్ బరిలో నిలబడతాడని తెలియగానే కర్నూలు ఎమ్మెల్యే మోహన్ రెడ్డి తన సీటు ఇస్తానన్నాడు. ఇక సీఎం చంద్రబాబు కుప్పం సీటు ఇచ్చేస్తారని చర్చ జరిగింది. ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు లోకేష్ చూపు విశాఖ లేదా భీమిలిపై పడిందట.. ప్రస్తుతం బాలయ్య రెండో అల్లుడు భరత్ విశాఖ ఎంపీ లేదా.. భీమిలి ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నారు. ఈ రెండింట్లో ఏదో సీటు నుంచి టీడీపీ తరుఫున నిలబడాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో లాబీయింగ్ చేస్తున్నారు.

కానీ ఇప్పుడు లోకేష్ తన తోడల్లుడికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే విశాఖ లేదా భీమిలి నుంచి లోకేష్ పోటీచేయడానికి రెడీ అయ్యారట.. ఒకే ప్రాంతం నుంచి ఇద్దరు అల్లుల్లు పోటీపడితే తప్పుడు సంకేతాలు వెళతాయి కాబట్టి పోటీకి దూరంగా ఉండాలని తోడల్లుడు శ్రీభరత్ ను కోరారని చర్చ జరుగుతోంది. అయితే బాలయ్య రెండో అల్లుడు రాజకీయాల్లోకి రాకుండా.. విశాఖ జిల్లాలో పోటీపడకుండా చేయడానికే లోకేష్ బాబు ఇలా విశాఖలో పోటీ చేస్తున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. రెండో అల్లుడు టీడీపీ రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటితే తన ప్రభ తగ్గుతుందని.. పోలికలు చూపెట్టి లోకేష్ ను తక్కువ చేస్తారని భయపడే.. లోకేష్ ఈ ప్లాన్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ అల్లుల్ల లోపల ఏముందో..