సీనియర్ నటి కన్నుమూత!

ప్రముఖ బాలీవుడ్‌ నటి షమ్మి(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ సందీప్‌ ఖోస్లా ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఆమెకు నివాళులు అర్పించారు.బాలీవుడ్‌లో షమ్మిని అందరూ ముద్దుగా ‘షమ్మి ఆంటీ’ అని పిలిచేవారు.దాదాపు 18 ఏళ్ల వయసులో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ‘ఉస్తాద్ పెడ్రో’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
హీరోయిన్ గా ఆమె నటించిన తొలి చిత్రం ‘మల్హర్‌’. ఆ తర్వాత వరుసగా కూలీ నెం.1, ఖుదా గవా, హమ్‌, ఆర్థ్‌, ది బర్నింగ్‌ ట్రెయిన్‌ తదితర చిత్రాల్లో నటించారు. పలు ధారావాహికల్లోనూ షమ్మి నటించారు. బాలీవుడ్‌ దర్శక-నిర్మాత సుల్తాన్‌ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. వివాహమైన ఏడేళ్లకే ఇద్దరూ విడిపోయారు. షమ్మి చనిపోయిన నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు.