Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకల పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆది పురుష్, వన్ నేనొక్కడినే లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైయ్యాంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు.
తాజాగా ఈ బ్యూటీ టబు, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రూ’. ఈ సినిమా మార్చు 29న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో ఈ చిత్రయూనిట్ తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించగా కృతి సనన్ ఈ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది.
కృతి సనన్ మాట్లాడుతూ.. సినిమాలో ఒక స్టార్ హీరో ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు పరిగెత్తుకుంటూ రారు. కథ బాగుండాలి. దురదృష్టం ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు, నిర్మాతలకు కూడా ఈ విషయం అర్ధం కావట్లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారు, పెట్టిన డబ్బు రాదు అని అనుకుంటున్నారు. ఇది అబద్దం. స్టార్ హీరోలెవ్వరూ లేకపోయినా మా క్రూ సినిమా బాగా ఆడుతుంది.
ఇప్పటికే 100 కోట్లు కలెక్ట్ చేసింది. అలియాభట్ మెయిన్ లీడ్ లో వచ్చిన గంగూభాయ్ కతీయవాడి సినిమా కూడా పెద్ద హిట్ అయి కలెక్షన్స్ తెచ్చింది. అందులో కూడా స్టార్ హీరోలు లేరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్స్ కొడుతున్నా హీరోయిన్స్ సినిమాలకు బడ్జెట్ పరిమితులు ఎందుకు పెడుతున్నారో అర్ధం కావట్లేదు.
ఇండస్ట్రీలో మొహమాటానికి ఒకర్నొకరు పొగుడుతున్నారు. దానికంటే ఆపదలో ఉన్న తోటి నటీనటులకు సహాయంగా నిలబడితే బాగుంటుంది. ఇక్కడ నటీనటుల మధ్య యూనిటీ అంతగా లేదు. ఒక సినిమా హిట్ అయినప్పుడు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, ఎంతమంది ఏడుస్తున్నారో అర్ధం కావట్లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి.
ఇటీవలే.. బాలీవుడ్ దర్శక నిర్మాత నిఖిల్ అద్వానీ సౌత్ కూడా ఇదే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ సినీ పరిశ్రమలో ఐక్యత లేదు. అందరూ ఒకరికొకరు పోటీ పడాలని చూస్తారు. ఒకరు సక్సెస్ కొడితే ఇంకొకరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోరు. బాలీవుడ్ లో మన అందరం ముందుకొచ్చి మనమంతా ఒక్కటే అనిచెప్పగలగాలి. సౌత్ పరిశ్రమలతో పోలిస్తే మనలో ఐక్యత చాలా తక్కువ అని అన్నారు. గతంలో కూడా బాలీవుడ్‌లో యూనిట్ లేదు అనే విమర్శలు చాలానే వినిపించాయి.