హృతిక్ లుక్ చూస్తే షాకే!

సినిమాల్లో తమ పాత్రల కోసం ఒళ్ళు హూనం చేసుకునే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు. కమల్ హాసన్, విక్రం వంటి హీరోలు ఈ కోవకే చెందుతారు. అలానే ఇటీవల దంగల్ కోసం ఆమీర్ ఖాన్ ఎలా మారిపోయాడో చూశాం. అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే లిస్టు లోకి చేరిపోతున్నాడు స్టార్ హీరో హృతిక్ రోషన్. పాట్నాకు చెందిన గణిత బోధకుడు ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. దీనికోసం హృతిక్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు.
తన బాడీను షేప్ చేసిన తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తన కండలు కరిగించి అతి తక్కువ టైం లో బరువు తగ్గి మోహంలో కళ తగ్గించుకున్నాడు. నిరుపేద విద్యార్ధుల్లో ప్రతిభ గల ముప్పై మందిని ఎన్నుకొని ఆనంద్ కుమార్ ఇచ్చే కోచింగ్ నేపధ్యంలో సినిమా సాగుతుంది. వికాస్ బహ్ల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మృణాల్ టాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.