Homeతెలుగు Newsఅన్నా రాంబాబు గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితేంటి ?

అన్నా రాంబాబు గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితేంటి ?

anna rambabu
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. అన్నా రాంబాబు.  ప్రస్తుతం ప్రజల్లో  అన్నా రాంబాబు పరిస్థితేంటి ?,  అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. రాజకీయాల్లో అన్నా రాంబాబు గా ప్రసిద్ధులైనప్పటికీ.. ఆయన అసలు పేరు ‘అన్నా వెంకట రాంబాబు’. ఉమ్మడి ప్రకాశం జిల్లా  కంభం మండలం సైదాపురం గ్రామం వ్యవసాయ & వ్యాపార కుటుంబంలో అన్నా రాంబాబు జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాంబాబు ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. రాంబాబు రాజకీయాల్లోకి రాకముందు ఏ 1 కాంట్రాక్టర్ గా నిర్మాణ రంగంలో ఉన్నారు. అలాగే పలు కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. రాంబాబు తండ్రి సుబ్బరంగయ్య కాంగ్రెస్ పార్టీ లో గ్రామ స్థాయి నాయకుడిగా ఉండేవారు. అయితే రాంబాబు రాజకీయాల్లో రాకముందు కాంగ్రెస్ నేత, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య అనుచరుడిగా ఉంటూ వచ్చారు.

2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించిన అన్నా రాంబాబు,  2009 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. అనంతర కాలంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చలామణి అయ్యారు. 2014 లో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా టీడీపీలో చేరి  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రాంబాబు ఓటమి పాలయ్యారు.  2017 లో తెదేపా కు రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు.
 
ఇంతకీ,  రాజకీయ నాయకుడిగా  అన్నా రాంబాబు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో  అన్నా రాంబాబు పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ అన్నా రాంబాబుకి ఉందా ?, చూద్దాం రండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అన్నా రాంబాబు చాలా ముందు చూపు గల నాయకుడిగా చలామణి అవుతున్నారు. తనకు రాజకీయంగా లాభం చేకూర్చే వాటి మీదే  ఎక్కువ దృష్టి పెట్టడం అన్నా రాంబాబు శైలి. ఐతే, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కూడా అన్నా రాంబాబు నిలుస్తూ వస్తున్నారు. రాజకీయంగా వివాదరహితుడిగా మొదలైన తన ఇమేజ్ ను అన్నా రాంబాబు పోగొట్టుకున్నారు.  
 
మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కు దగ్గర కావాలని అన్నా రాంబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ కాలేదు.  జగన్ రెడ్డి అన్నా రాంబాబును దగ్గరకు తీసుకోలేదు. తన ఎమ్యెల్యేలలో ఒకడిగానే అన్నా రాంబాబును చూస్తూ వస్తున్నాడు. ఈ విషయంలో అన్నా రాంబాబు కాస్త అసంతృప్తిగా ఉన్నాడు. మరోవైపు అన్నా రాంబాబు పై ప్రజల్లో వ్యతిరేఖత కూడా ఉంది.  అన్నా రాంబాబు  వల్ల తమకు ఎలాంటి  ప్రయోజనం జరగడం లేదు అని ప్రజల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. దీనికితోడు అన్నా రాంబాబు కుటుంబ సభ్యుల పై పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. 
 
రాంబాబు పేరుకు గిద్దలూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నా..   అతని రాజకీయ మరియు వాణిజ్య కార్యకలాపాలకు వేదిక మాత్రం మార్కాపురం.  రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నుండి లేదా మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాంబాబు  ప్రయత్నాలు చేస్తున్నారు అని టాక్ ఉంది. ఐతే, అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే.. గెలిచే పార్టీ వైపు ఉండాలి.  అందుకే,  ఈ సారి  జగన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేయకుండా జనసేన లేదా టీడీపీ నుంచి పోటీ చేయాలనీ  అన్నా రాంబాబు ప్లాన్ చేస్తున్నారు.  మొత్తమ్మీద ఈ సారి అన్నా రాంబాబు గెలిచే వరకూ నమ్మలేం.  

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!