
Anirudh Ravichander Marriage:
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్ పెళ్లి వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న అనిరుధ్ త్వరలోనే కావ్యా మారన్‌ను వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కావ్యా మారన్ అంటే అందరికీ తెలిసిన పేరు. సన్ గ్రూప్ ఛైర్మన్ కలానిధి మారన్ కుమార్తె కావ్య IPL లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇటీవల రేడిట్‌లో వచ్చిన ఒక పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చింది. అందులో ప్రకారం అనిరుధ్, కావ్యా ఏడాదిగా డేటింగ్ చేస్తున్నారు. వారి పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అయితే ఇంతవరకూ అనిరుధ్ గానీ, కావ్యా గానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
View this post on Instagram
అనిరుధ్ కుటుంబం ఆర్ట్స్‌తో ముడిపడిన కుటుంబమే. ఆయన తండ్రి రవి రాఘవేంద్ర ఒక నటుడు కాగా, తల్లి లక్ష్మి ఒక క్లాసికల్ డాన్సర్. అంతేకాకుండా ఆయన మామయ్య ఎవరో తెలుసా? రజనీకాంత్! అనిరుధ్ తల్లి లతా రజనీకాంత్ భార్య కావడం ప్రత్యేకం. ఇక అతని తాత గారు కె. సుబ్రహ్మణ్యం 1930లలో దర్శకుడు కూడా. ప్రొఫెషనల్‌గా చూస్తే అనిరుధ్ ప్రస్తుతం ఇండియాలో అత్యంత బిజీ అయిన మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు. సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ కంపోజర్ కూడా.
ఇదిలా ఉండగా, కావ్యా మారన్ 33 ఏళ్ల వయసు కలిగి, సన్ గ్రూప్ బిజినెస్‌లో కీలక పాత్ర పోషిస్తూ IPLలో తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచుల సమయంలో ఆమె హాపీ, సాడ్ expressions చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.