
Allu Arjun Shaktimaan Movie:
తాజాగా నిర్మాత నాగ వంశీ త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే, ఇది తొలుత త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం ప్లాన్ చేసిన కథ అని టాక్.
అయితే అల్లు అర్జున్ ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కమిట్ కావడంతో, త్రివిక్రమ్ తన స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్ కు మార్చినట్లు తెలుస్తోంది. దీని పైనే అల్లు అర్జున్ క్యాంప్ నుంచి కూడా స్ట్రాటజిక్ కౌంటర్ వచ్చింది.
అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘శక్తిమాన్’ అనే సూపర్ హీరో ప్రాజెక్ట్ చేయనున్నాడని లీక్ పెడుతున్నారు. ఈ సినిమాకు మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నాడట. కానీ ఇది నిజమైన ప్రాజెక్ట్ అనేదానిపై డౌట్స్ ఉన్నాయి.
View this post on Instagram
అసలు ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 3 కోసం కూడా సిద్ధమవుతున్నాడు. అట్లీ సినిమా తర్వాత శక్తిమాన్ అనే కొత్త ప్రాజెక్ట్ చేసేందుకు టైమ్ ఇస్తాడా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. పైగా శక్తిమాన్ అనే టైటిల్ చాలాకాలం క్రితం వచ్చిన టీవీ సీరియల్ కి సంబంధించినది. ప్రస్తుత జనరేషన్ కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అనేది కూడా ప్రశ్నే.
ఇలాంటి సందర్భాల్లో టాప్ హీరోలు దర్శకులను నిరాకరించకుండా అసలు క్లారిటీ ఇవ్వకుండా నిరీక్షింపజేస్తుంటారు. ఇదీ అల్లు అర్జున్ స్ట్రాటజీ అని అంటున్నారు ఇండస్ట్రీలో. ఇన్‌సైడర్స్ ప్రకారం ‘శక్తిమాన్’ ప్రాజెక్ట్ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోపై వచ్చిన బజ్ ను కవర్ చేయాలనే పీఆర్ స్టంట్ మాత్రమే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.