HomeTelugu Newsఅభిమన్యుడు సినిమాతో విశాల్‌

అభిమన్యుడు సినిమాతో విశాల్‌

తమళ మాస్‌ హీరో విశాల్‌ . ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలను చేస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. క్రిందటి సంవత్సరం విడుదలైన డిటెక్టివ్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ మధ్యే తమిళనాట విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ఇరుంబుదురై సైబర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ ఇండస్ర్టీలో వసూళ్ల సునామిని సృష్టిస్తోంది.

7 2

తెలుగులో ఈ సినిమా అభిమన్యుడుగా రాబోతుంది. ఈ చిత్రాన్ని ఎం. పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి. హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు విడుదల చేశారు చిత్రయూనిట్‌. విశాల్‌ సమంత జంటగా నటించిన ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌ గా నటిస్తున్నారు. విశాల్‌, అర్జున్‌ మధ్య జరిగే సీన్స్‌ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ సినిమా జూన్‌ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu