కీర్తి షాకింగ్ లుక్!

ఇప్పుడున్న హీరోయిన్లలో కాస్త భిన్నంగా ఉంటుంది కీర్తి సురేష్. స్టార్ హీరోయిన్ కావాలంటే నాజుకుగా ఉండాల్సిందే అని భావించే హీరోయిన్లకు కీర్తి భిన్నం. ఆమె మొదటి నుంచి కాస్త బొద్దుగా కనిపించేది. ఆ లుక్ తోనే ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సరసన అజ్ఞాతవాసి సినిమాలో నటించింది. ఈ సినిమాలోనూ కీర్తి లుక్ ఏమి మారలేదు. అయితే ఆ లుక్ సంగతి సరే కానీ, అజ్ఞాతవాసి ఆడియో వేడుకకి కీర్తి తయరై వచ్చిన తీరు చూసి అందరు షాక్ అవుతున్నారు.

ఆమె స్టైలింగ్ ఆకర్షణీయంగా లేదు. నిండుగా బట్టలు వేసుకున్న అందంగా కనిపించొచ్చు కానీ. ఆమె డ్రెస్ డిజైన్ చేసిన తీరు, హెయిర్ స్టైల్, మేకప్ అన్ని తేడాగా అనిపించాయి. ఈ లుక్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది