HomeTelugu News'అరవింద సమేత వీర రాఘవ' టీజర్‌ డేట్‌

‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్‌ డేట్‌

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ చిత్రంలో పూజా పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్‌ లుక్‌తోనే ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది ఈ మూవీ యూనిట్‌. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నుట్లు మేకర్స్‌ గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో షికారు చేస్తోంది.

7 7

ఆగస్టు 15న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. రామోజీ ఫిలిం సిటీలో తారక్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. పదిహేను రోజులకి పైగా సాగే ఈ షెడ్యూల్‌ అనంతరం చిత్రీకరణ పొలాచ్చిలో జరగనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సిక్స్‌ ప్యాక్‌తో సందడి చేయబోతున్నాడు తారక్‌. ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu