రోషన్ కు బెస్ట్ డెబ్యూ అవుతుంది: శ్రీకాంత్!

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, శ్రియా శర్మ హీరో హీరోయిన్లుగా హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిలిం ప్రొడక్షన్‌ బ్యానర్స్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘నిర్మలకాన్వెంట్‌’ కింగ్‌ నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్, శ్రీకాంత్, ఊహాలు విలేకర్లతో ముచ్చటించారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. ”నిర్మలాకాన్వెంట్ లో రోషన్ నటిస్తాడని ఊహించలేదు. అప్పుడే తనను పరిచయం చేయాలనుకోలేదు. కానీ సబ్జెక్టు బావుంది. మంచి బ్యానర్ కావడంతో ఇంతకంటే బెస్ట్ డెబ్యూ రాదని భావించాం. నటుడిగా తను ఎదగడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. షూటింగ్ చూడడానికి ఒకరోజు వెళ్ళాను. తను చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. సినిమా ఫైనల్ రిజల్ట్ చూడలేదు. కానీ చూసిన వారంతా బావుందని చెబుతున్నారు. నేను బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాను. రోషన్ కు మాత్రం బ్యాక్ గ్రౌండ్ ఉంది. దాన్ని నిలబెట్టుకొని, హార్డ్ వర్క్ చేయాలని చెప్పేవాడిని. ఇప్పుడు తన డెడికేషన్, పట్టుదల చూస్తుంటే నాకంటే మంచి స్థాయికి తను ఎదుగుతాడని అనిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున గారు ఉండడం రోషన్ కు మంచి సపోర్ట్ గా అనిపించింది. రోషన్ కు ఇది మొదటి సినిమా అయినా.. సెంటిమెంట్ సీన్స్ లో అధ్బుతంగా నటించాడు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రోషన్ కు రెండేళ్ళు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాం. రోషన్ కూడా అదే అభిప్రాయ పడుతున్నాడు. తను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది” అని చెప్పారు.
ఊహా మాట్లాడుతూ.. ”రోషన్ కు సినిమా మీద ఆసక్తి వచ్చినప్పుడు ‘రుద్రమదేవి’ సినిమా ఛాన్స్ వచ్చింది. అక్కడితో ఆపేయాలని అనుకున్నాం. కానీ నిర్మలా కాన్వెంట్ ఆఫర్ వచ్చింది. మంచి కథ, నాగార్జున గారు అసోసియేట్ అవ్వడం, తన వయసుకి తగ్గ కథ అనిపించడంతో ఒప్పుకున్నాం. సినిమా వలన రోషన్ స్టడీస్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నాం. డైరెక్టర్ గారు కూడా హెల్ప్ చేశారు” అని చెప్పారు.
రోషన్ మాట్లాడుతూ.. ”బేసిక్ గా నేను క్రికెట్ బాగా ఆడతాను. అయితే దానికంటే సినిమా మీద
ఆసక్తి బాగా పెరిగింది. రుద్రమదేవి సినిమాలో నటించినప్పుడు కొంచెం నెర్వస్ అయ్యాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి, హీరోగా నటించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ జరిగేప్పుడు మొదటి మూడు రోజులు చాలా టెన్షన్ పడ్డాను. మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాను. ఎమోషనల్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడినప్పుడు డైరెక్టర్ గారి సలహాలు తీసుకున్నాను. ఇంట్లో నన్ను ఓ నటుడి కొడుకులా పెంచలేదు. నాకు అమ్మా, నాన్నే స్పూర్తి” అని చెప్పారు.

CLICK HERE!! For the aha Latest Updates