HomeTelugu Newsఆర్కా బ‌హుబ‌లి కామిక్ బుక్‌

ఆర్కా బ‌హుబ‌లి కామిక్ బుక్‌

సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ బ‌హుబ‌లి సిరీస్‌ నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ ఇప్పుడు ఆ చిత్రాన్ని జ‌పాన్ లో కామిక్ బుక్ రూపంలో తీసుకురానుంది. దీని కోసం జ‌పాన్ లోని ఓ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బ‌హుబ‌లి-2 దాదాపు 1750 కోట్లు వ‌సూలు చేయ‌గా దేశంలో నెంబ‌రు-1 స్థానంలో వ‌ర‌ల్డ్ నంబర్ 2 భార‌తీయ సినిమాగా రికార్డు సాధించింది. బాహుబలి సిరీస్ భార‌త దేశంలో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో మ‌న‌కు తెలిసిందే. అంత‌కు మించి జ‌పాన్‌లో విజ‌యం సాధించింది. అక్క‌డి ప్ర‌జ‌లు బ‌హుబ‌లికి బ్ర‌హ్మర‌థం ప‌ట్టారంటే ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో మ‌నం అర్ధం చేసుకోవ‌చ్చు. సామాజిక మాధ్య‌మాల్లోనూబాహుబ‌లి ప్ర‌మోష‌న్ బాగా చేశారు. బాహుబ‌లి కార్టూన్లు జ‌పాన్ ప‌త్రిక‌లో బాగా ప్రాచుర్యం అయ్యాయి.

2 1

ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో కామిక్ బుక్ సిరీస్ విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర‌ల ఆధారంగా ఈ కామిక్ బుక్ సిరిస్ రూపొందించనున్నారు. త‌ను చిన్న‌ప్పుడు కామిక్ బుక్ స్ఫూర్తితో పెరిగాన‌ని, సినీ నిర్మాణాల‌కు ఇవి బాగా ఉప‌యోగ‌ప‌డేవ‌ని, ఇప్పుడు ఈ కామిక్ బుక్ జ‌పాన్‌లో రిలిజ్ చేయ‌డం ఆనందంగా ఉందని దర్శకుడు రాజ‌మౌళి త‌న ప్రసంగంలో వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu