ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి నాని ‘జెర్సీ’ సినిమా!

హీరో నాని నటిస్తున్న సినిమా ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. చిత్ర్రాన్ని ఒక్క దక్షిణాదిలో మాత్రమే కాకుండా ఉత్తరాదిన కూడా భారీస్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ ఈ భాద్యతను తీసుకుంది. ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్ పాత్రలో కనిపించనుండగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఏప్రిల్ 19న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

CLICK HERE!! For the aha Latest Updates