HomeTelugu News'ఆర్‌ఎక్స్‌ 100' తమిళ రీమేక్ లో..

‘ఆర్‌ఎక్స్‌ 100’ తమిళ రీమేక్ లో..

 

3 12
ఇటీవలే విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఏ ఇద్దరు కుర్రాళ్ళు మాట్లాడుకున్నా వారి నడుమ ఈ సినిమా టాపిక్ నడవాల్సిందే. అంతగా ఆకట్టుకున్నది ఈ సినిమా కథ, అందులోని హీరో పాత్ర. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కార్తికేయ హీరోగా నటించి మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ ఈ సినిమాను తమిళంలోకి రీమేక్ చేసే పనులు జరుగుతున్నాయి. ఈ రీమేక్ లో ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించనున్నాడు. ఔరా సినిమాస్ నిర్మించనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు, కీలకమైన హీరోయిన్ పాత్రను ఏ నటి చేస్తుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu