‘స్పైడర్’లో ఆ సీన్లు లేవట!

దర్శకుడు మురుగదాస్ కు తనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. తన సినిమాల విషయంలో కూడా ఆ నియమ నిబంధనలను ఎప్పుడు క్రాస్ చేయడు. మురుగదాస్ మద్యపానం, ధూమపానానికి వ్యతిరేకి. తన సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశాలను చూపించడు. ఈయన డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘స్పైడర్’ విషయంలో కూడా ఈ రూల్ ను ఫాలో అయినట్లు తెలుస్తోంది. ‘స్పైడర్’ సినిమాలో ఎక్కడా.. పొగతాగే సీన్ కానీ, మద్యం తాగే సీన్ గానీ లేదని సమాచారం. సినిమాలో హీరో మహేష్ తో కానీ, ప్రతినాయకులు సూర్య, భరత్ లతో కానీ ఏ సన్నివేశంలో కూడా సిగరెట్ పట్టించలేదట. 
అలానే మద్యం తాగే సన్నివేశాలు కూడా లేవని తెలుస్తోంది. చాలా వరకు సినిమాల్లో హీరోయిజాన్ని, విలనిజాన్ని ఎలివేట్ చేయడానికి అనే కారణంతో మద్యం, సిగరెట్ తాగే సన్నివేశాలను చూపిస్తుంటారు. తాము వాటిని ప్రోత్సహించడం లేదని చెబుతూనే సీన్ డిమాండ్ చేసిందని చెప్పి కవర్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అయితే మురుగదాస్ మాత్రం అలాంటి సన్నివేశాలను పూర్తిగా వ్యతిరేకిస్తాడు. ఇదివరకు కూడా తన సినిమాల విషయంలో ఇదే ఫాలో అయ్యాడు.