HomeTelugu Newsఎన్టీఆర్‌ చెంపలు పగలుగొట్టిన అభయ్‌..!

ఎన్టీఆర్‌ చెంపలు పగలుగొట్టిన అభయ్‌..!

జానియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతిల పెద్ద కుమారుడు అభయ్‌ రామ్‌ ఎంత అల్లరివాడో అభిమానులకు తెలిసిందే. ఒక్కోసారి అభయ్‌ చేసే అల్లరి చేష్టలను తారక్‌ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. తాజాగా తారక్‌ తన కుమారుడు అభయ్‌కి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో అభయ్‌ తన తండ్రి ఒడిలో కూర్చుని చెంపలు వాయిస్తూ కన్పించాడు.

2 29

ఈ వీడియోకు తారక్‌..’నా కుమారుడికి నేను పంచింగ్‌ బ్యాగ్‌ అయిన వేళ..’ అని సరదాగా క్యాప్షన్‌ ఇచ్చారు. కరాటే కిడ్‌ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. దీన్ని బట్టి చూస్తే అభయ్‌ కరాటే నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విద్యలన్నీ తన తండ్రిపై ప్రదర్శిస్తున్నట్టున్నాడు. ఇటీవల తారక్‌, ప్రణతి దంపతులకు రెండో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. అతనికి భార్గవ్‌ రామ్‌ అని నామకరణం చేశారు.ప్రస్తుతం తారక్‌ ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

When you become a #punchingbag for your son #karatekid #elderbrat #lazysunday

A post shared by Jr NTR (@jrntr) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu