బుల్‌బుల్ తరంగ్‌లో సోనాక్షి సిన్హా


బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా ఇప్పటికే ‘ఫాలెన్’ అనే వెబ్‌సిరీస్‌తో డిజిట‌ల్ రంగంలోకి అడుగుపెట్టింది. స్టార్ హీరోల‌తో న‌టిస్తూ ప్రధాన హీరోయిన్ల జాబితాలో చేరిన సోనాక్షిసిన్హా తాజాగా మరో వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. శ్రీనారాయణ్‌ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్‌సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనికి బుల్‌బుల్ తరంగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా వరకట్నం నేపథ్యంలో ఉండబోతుందట. సాధారణ యువతి పాత్రలో సోనాక్షి నటిస్తున్నట్లు తెలుస్తోంది. సోనాక్షి సంజయ్ లీలా బన్సాలీ నిర్మాణంలో రూపొందుతున్న మరో వెబ్‌సిరీస్‌లో నటించనున్నట్టు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates