HomeTelugu Big Storiesకేరళకు విజయ్‌ దేవరకొండ విరాళం

కేరళకు విజయ్‌ దేవరకొండ విరాళం

కేరళ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ర్ట ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నటులు విశాల్‌, సూర్య, కార్తి తదితరులు తమ వంతు సహాయం చేశారు. విశాల్‌ ‘కేరళ రెస్క్యూ’ పేరుతో అత్యవసర వస్తువులను సేకరిస్తున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కేరళ వాసుల కోసం రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ‘విహారయాత్రకు వెళ్లాలంటే కేరళ నా మొదటి ఎంపిక. నాకు ఈ ప్రాంతం ఎన్నో మధుర జ్ఞాపకాల్ని ఇచ్చింది. అక్కడే నాకు మంచి స్నేహితులు కూడా దొరికారు. వారిని (కేరళ బాధితులను) నేరుగా ఎలా కలవాలో తెలియడం లేదు.

6 10

కానీ నేను వారి గురించి ఆలోచిస్తున్నాను. రౌడీస్‌ మీకు తోచిన చిన్న సహాయం చేయండి, అది కేరళలోని మనలాంటి కొందరి జీవితాల్లో పెద్ద మార్పునకు కారణం అవుతుంది. నేను రూ.5 లక్షలతో దీన్ని ప్రారంభించా’ అని విజయ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో పాటు కేరళ ముఖ్యమంత్రి విపత్తు నిర్వహణ సంస్థకు విజయవంతంగా డబ్బులు వెళ్లాయని వచ్చిన సందేశం స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు విజయ్‌ దేవరకొండను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. ‘మీది బంగారు హృదయం, గ్రేట్‌, సూపర్‌, మేము కూడా సహాయం చేస్తాం..’ అని రాశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu