HBD Vijay Devarakonda: టాలీవుడ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తరచూ వివాదాల్లో చిక్కుకుంటాడు. స్క్రీన్‌పై మరియు బయటా ఒకే రకమైన వైఖరితో ఉండటంతో ఆయన గురించి ఏదో రచ్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంటుంది. ఇలా విజయ్‌పై జరిగిన 5 కాంట్రవర్సీలు ఏమిటో..చూద్దాం.
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ చేసిన ప్రాత్రపై విమర్శలు మరియు ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ స్త్రీల పట్ల వ్యవహరించిన తీరుపై చర్చలకు దారితీసింది. స్త్రీ పాత్రలను చెంపదెబ్బ కొట్టడం సహా అతని ఆన్-స్క్రీన్ ప్రవర్తనపై ప్రేక్షకులు మండిపడ్డారు.
“లైగర్” విడుదలకు ముందే, మీడియా పట్ల విజయ్ దేవరకొండ తన ప్రవర్తనతో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో విలేకరులతో ఇంటరాక్షన్‌లో తన పాదాలను టేబుల్‌పై పెట్టడం వివాస్పదంగా మారింది. కొన్ని ప్రశ్నలకు విజయ్ దేవరకొండ పొగరుగా సమాధానం చెప్పడం. తాను దేనీకి భయపడనని, తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని, తన అభిమానులను హర్ట్ చేసేలా మాట్లాడటం ఇవన్నీ కాంట్రవర్సీ అయ్యాయి.
విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంట్రీలో.. ఫ్యాన్స్ ని జరగండ్రా.. మీ అమ్మ అనడం కూడా వివాదస్పదంగా మారింది. ఈ సినమాలో ఓ సన్నివేశం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ డైలాగ్స్‌పై విజయ్ మరియు దర్శకుడు ఇద్దరిపైనా ప్రేక్షకులు మండిపడ్డారు.
డియర్ కామ్రేడ్ మూవీ టైమ్‌లో.. ఓ ఇంటర్వ్యూలో, విజయ్ తన సహనటి రష్మిక మందన్న శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పైగా తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం కూడా వివాదాలకు దారితీసింది. మహిళల గురించి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. అలా కాకుండా బాడీ షేమింగ్ అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
స్త్రీలను కించపరిచేలా వున్న అర్జున్ రెడ్డి వంటి చిత్రాలను సమర్థిస్తూ విజయ్ చేసిన ప్రకటనలు మరింత వివాదాన్ని రేకెత్తించాయి. అర్జున్ రెడ్డి మూవీ మరియు ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో అతను నటించిన పాత్రలు, స్త్రీలపట్ల ప్రవర్తించే తీరు చర్చనీయాంశంగా మారింది. రెండు సినిమాల్లోనూ విజయ్ హీరోయిన్లను చెంపదెబ్బ కొట్టేలా చూపించడం, అదే హీరోయిజంలా ఫీల్ అవ్వడం వంటివి కాంట్రవర్సీగా మారాయి.