HomeTelugu Big Stories'గీత గోవిందం' నా సినిమా కాపీ.. ప్రముఖ దర్శకుడు కామెంట్స్‌

‘గీత గోవిందం’ నా సినిమా కాపీ.. ప్రముఖ దర్శకుడు కామెంట్స్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకుంది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా, అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరించారు. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యారు. కాగా ఈ సినిమా గురించి రాఘవేంద్రరావు తనదైన శైలిలో కామెంట్స్‌ చేశారు.

4 27

ఇటీవల సంతోషం సినిమా అవార్డ్స్‌ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. రాఘవేంద్రరావు కూడా ఈ వేడుకకు వెళ్లారు. అక్కడి స్టేజ్‌పై గీత గోవిందం సినిమా గురించి ప్రస్తావిస్తూ.. తాను తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాను కాపీ కొట్టి పరశురామ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చమత్కరించారు. 20 ఏళ్ల క్రితం నేను, అల్లు అరవింద్‌ పెళ్లి సందడి సినిమాను తెరకెక్కించాం. గీత గోవిందం సినిమా చూశాక నాకు పెళ్లి సందడి రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక్క ముద్దు సన్నివేశం లేకుండా సినిమాను తెరకెక్కించడం ఈరోజుల్లో అసంభవం. నిర్మాతల నుంచి ఎంతో ఒత్తిడి ఎదురవుతుంటుంది. ఏ విషయంలోనూ రాజీపడకుండా పరశురామ్‌ ఇంత చక్కటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు అతనికి శుభాకాంక్షలు అని వెల్లడించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu