బొమ్మరిల్లు భాస్కర్ కు బన్నీ అవకాశం!

బొమ్మరిల్లు చిత్రంతో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు భాస్కర్. ఇక
ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అయితే ఆ తరువాత చేసిన ఆరెంజ్,
ఒంగోలు గిత్త వంటి చిత్రలతో భాస్కర్ కు అవకాశం ఇవ్వడానికి నిర్మాతలు, హీరోలు భయపడ్డారు.
తమిళంలో చేసిన బెంగుళూరు డేస్ రీమేక్ కూడా దెబ్బ కొట్టింది. దీంతో ఈ డైరెక్టర్ పనైపోయిందని
అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అవకాశం సంపాదించి
అందరినీ ఆశ్చర్య పరిచాడు. గత కొన్ని నెలలుగా కథ పట్టుకొని గీతాఆర్ట్స్ చుట్టూ తిరిగిన
భాస్కర్ కు బన్నీతో ఉన్న స్నేహమే అవకాశం వచ్చేలా చేసింది. త్వరలోనే బొమ్మరిల్లు
భాస్కర్ ఈ బ్యానర్ లో సినిమా చేయబోతున్నారు. అయితే హీరోగా ప్రస్తుతం ఉన్న యంగ్
హీరోల్లో ఒకరిని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. భాస్కర్ పేరు చెప్తే ఎవరు ముందుకు రాకపోయినా..
గీతాఆర్ట్స్ భరోసా ఉండడంతో ఖచ్చితంగా హీరోలు సినిమా చేయడానికి అంగీకరిస్తారు. మరి
ఈ అవకాశాన్నైనా.. డైరెక్టర్ చక్కగా వినియోగించుకుంటాడో.. లేదో చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates