Homeతెలుగు Newsతెలంగాణలో అద్భుతం.. నీటిపంపింగ్ లో ‘మేఘా’ సంచలనం

తెలంగాణలో అద్భుతం.. నీటిపంపింగ్ లో ‘మేఘా’ సంచలనం

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ సంస్థ.. క్లుప్తంగా ‘మెయిల్’.. ఎన్నో ఏళ్ల తెలంగాణ సాగునీటి కల.. కేసీఆర్ కలలుగన్న కాళేశ్వరాన్ని ప్రపంచమే అబ్బురపరిచేలా మూడేళ్లలో పూర్తి చేసింది ఇదే ‘మేఘా’ సంస్థ. మేఘా చేపట్టిన కాళేశ్వరం.. భూగర్భంలో పంప్ హౌస్ లు ఇలా ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్షాత్కారంగా ఈ ప్రాజెక్ట్ నిలిచింది. అలాంటి మేఘా మరో ఆద్భుతాన్ని ఆవిష్కరించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దాదాపు 300 మీటర్ల ఎగువకు గోదావరి నీటిని అనతికాలంలోనే ఎదురెక్కించి ప్రపంచ రికార్డును సాధించి పెట్టింది. ప్రపంచ నీటి పారుదల చిత్రపటంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ‘మేఘా సంస్థ’ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది.

కాళేశ్వరం అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు. పల్లెమెరుగే నీటిని ఏకంగా 300 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసి గోదావరికి కొత్త నడకను మేఘా సంస్థ నేర్పింది. కాళేశ్వరం మూడు బ్యారేజీలతోపాటు నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరును ‘మేఘా సంస్థ’ నింపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి పంపింగ్ మొదలైన కేవలం 20 రోజుల్లోనే 25 టీఎంసీల సామర్థ్యం గల మిడ్ మానేరు జలాశయాన్ని నింపి మేఘా మహా అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఒక రోజుకు ఏకంగా 2 టీఎంసీల నీటిని పంప్ చేయడం.. మధ్య జలశయాల్లో నిల్వ చేయడం.. మళ్లీ పంప్ చేసి 25 టీఎంసీల మిడ్ మానేరు ప్రాజెక్టును నింపడం ద్వారా మేఘా ఇంజినీరింగ్ సంస్థ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

Water pumping in Kaleshwaram

కాళేశ్వరం ప్రాజెక్టును జెట్ స్పీడ్ వేగంగా పూర్తి చేసిన మేఘా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దాని నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. కాళేశ్వం ప్రాజెక్టులో కీలకమైన మూడు ఎత్తిపోతలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్ మీదుగా మిడ్ మానేరుకు నీటిని తరలించి ఔరా అనిపించింది. ఈ క్రమంలోనే గోదావరి దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా ఈ ఏడాది జులై 5 నుంచి డిసెంబర్‌ 6 తేది వరకు 24.062 టిఎంసీల నీటిని మేఘా కంపెనీ ఎత్తిపోయడం అద్భుతమైన విషయంగా చెప్పవచ్చు. ఇక లక్ష్మీ పంప్ హౌస్ పైన గోదావరిపై ఉన్న అన్నారం బ్యారేజీ వద్ద సరస్వతి పంప్ హౌస్ ద్వారా ఏడాది జులై 22 నుంచి డిసెంబర్‌ 6 వరకు 1781 గంటల పాటు పంపింగ్‌చేసి 18.559 టిఎంసీల నీటిని ఎగువకు మళ్లించారు. ఇక మూడో పంప్ హౌస్ సుందిల్ల వద్దనున్న పార్వతి పంపింగ్‌ కేంద్రం నుంచి ఇప్పటి దాకా 1639 గంటలు మిషన్లను పనిచేయించి 15.404 టిఎంసీల నీటిని శ్రీపాదసాగర్‌ ఎల్లంపల్లి జలాశయానికి చేర్చారు.

ఇక ఇవే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్దదైన బాహుబలి గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఏకంగా 430మీటర్ల లోతున భూగర్భం నుంచి 7 భారీ బాహుబలి మోటార్ల ద్వారా 2602 గంటల పాటు పనిచేయగా 29.70 టిఎంసీల నీటిని మిడ్‌మానేరు వైపు తరలించింది. సిరిసిల్లా సమీపంలోకి నీటిని తీసుకొచ్చి సిరిసిల్ల వాసులు, ఆ ఎమ్మెల్యే, మంత్రి అయిన కేటీఆర్ ఆశయాన్ని నిలబెట్టింది.

సీఎం కేసీఆర్ పట్టుదల, మేఘా ఇంజినీరింగ్ సంస్థ కృషి ఇంజనీరింగ్ ప్రతిభకు గోదావరి దారి మళ్లి తెలంగాణను సస్యశ్యామలం చేసింది. అనుకుంటే సాధించనది లేదని నమ్మి భగీరథ ప్రయత్నం చేసిన కేసీఆర్ కలలను ‘మేఘా’ సంస్థ సాకారం చేసి తెలంగాణ సాగునీటి రంగాన్ని మార్చేసింది. ప్రపంచంలోనే ఏ సాగునీటి రంగంలో చేయని అద్భుతాన్ని తెలంగాణలో నీటిపంపింగ్ ద్వారా చేసి ‘మేఘా’ నభూతో నభవిష్యతి అన్న రీతిలో రికార్డులు తిరగరాసింది. తెలంగాణ కరువును తరిమికొట్టింది. జనాల, రాజకీయ నేతలు, అధికారుల నుంచి జయజయ ద్వానాలను అందుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu