HomeTelugu Big Storiesపండగ చేసుకుంటున్న మహేష్ బాబు అభిమానులు..!

పండగ చేసుకుంటున్న మహేష్ బాబు అభిమానులు..!

1 17
దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్‌ బాబు కాంబినేషన్‌లో మూవీ వస్తే ఎలాగుంటుంది. బొమ్మ అదిరిపోద్ది. అందుకే అభిమానులు కూడా ఎంతో ఆశగా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కూడా గతంలో చాలాసార్లు చెప్పాడట మహేష్‌బాబుతో సినిమా చేస్తానని. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా గురించి కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి. మన జక్కన్న కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దానయ్య సినిమా అపోయిన తర్వాత నారాయణ నిర్మాణంలో మహేష్‌బాబుతో సినిమా ఉంటుందని ప్రకటించాడు. దీన్ని బట్టి చూస్తుంటే మహేష్‌తో రాజమౌళి సినిమా ఫిక్స్ అయినట్టే తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీగా ఉన్నాడు. మహేష్ కూడా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ మూవీ పట్టాలెక్కబోతుందన్నమాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu