HomeTelugu News'దేవదాస్‌' ఫస్ట్‌లుక్‌

‘దేవదాస్‌’ ఫస్ట్‌లుక్‌

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానిలు హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’. ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక, ఆకాంక్ష సింగఖ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్విని దత్‌ ఈ సినిను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఈరోజు(మంగళవారం) సాయంత్రం విడుదల చేశారు. నాగ్‌, నాని పక్కపక్కన పడుకుని ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

7 6

దీన్ని నాగ్‌ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సాధారణంగా పారు నా పక్కన ఉండేది. కానీ ఈ సారి ఈ దాస్‌ పక్కన ఇరుక్కున్నా’అంటూ కోపంతో ఉన్న ఎమోజీని పోస్ట్‌ చేశారు. ఈ సినిమా ఫన్‌గా ఉంటుందని చెప్పారు. సెప్టెంబరు 27న నిద్ర లేవబోతున్నామని ప్రచార చిత్రంపై రాసి ఉంది. నాగ్‌ చేతిలో తుపాకీ, మందు సీసా ఉండగా.. నాని మెడలో స్టెతస్కోప్ ఉంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu