డ్రగ్స్ కావాలనే తీసుకున్నా!

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన ‘జగ్గా జాసూస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అతడి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓసారి కావాలని డ్రగ్స్ తీసుకున్నానని వెల్లడించారు. సినిమాలో సన్నివేశం సహజంగా రావాలనే ఉద్దేశంతోనే అలా చేశానని చెప్పుకొచ్చాడు ఈ హీరో. 2011 లో వచ్చిన ‘రాక్ స్టార్’ అనే సినిమాలో రణబీర్ హీరోగా నటించాడు.

ఈ సినిమాలో రణబీర్ మధ్యం సేవించి స్టేజ్ మీద ఓ ప్రదర్శన ఇవ్వాల్సిన సన్నివేశం ఒకటి ఉంది. ఆ సన్నివేశం సహజంగా ఉండాలని భావించిన రణబీర్ తక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు చదువుకునే రోజుల్లోనే తనకు డ్రగ్స్ అలవాటు ఉండేదని.. ఆ తరువాత పూర్తిగా మానేశానని వెల్లడించారు. ప్రస్తుతం రణబీర్ సంజయ్ దత్ బయోపిక్ లో అలాన్ డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.