అల్లు అర్జున్‌తో రాశిఖన్నా!

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే సినిమాపై చాలనే అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని సినిమాను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. ఇందులో బన్నీకి జోడిగా జైలవకుశ సినిమాలో హీరోయిన్ గా చేసిన రాశిఖన్నాను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వెంకిమామ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటిస్తున్నది. ఈ మూవీ షూటింగ్ ప్రసుత్తం వైజాగ్ లో జరుగుతున్నది.