HomeTelugu Newsనిర్మాతగా మారోబోతున్న జగ్గుబాయ్‌

నిర్మాతగా మారోబోతున్న జగ్గుబాయ్‌

కుటుంబ కథ చిత్రాలతో మహిళలను ఆకట్టుకునే చిత్రాలకు జగపతిబాబు కీలకం. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే అవకాశలు తగ్గడంతో ఇప్పుడు విలన్‌గాను తన సత్త చూపుతున్నాడు. విలన్ గా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే విలన్ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రస్తుతం అరవింద సమేత, సైరా, యాత్ర వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

2 16

అయితే తాజాగా ఈ హీరో కమ్‌ విలన్‌ నిర్మాతగా మారోబోతున్నాడు. జగపతిబాబు ఓ వెబ్ సీరీస్ ను రూపొందించబోతున్నట్టు సమాచారం. సినిమాల కంటే ఈ మధ్యకాలంలో వెబ్ సీరీస్ లు బాగా క్లిక్ అవుతున్నాయి. పైగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు వెబ్ సీరీస్ లను ప్లే చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి. జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రాసాద్ నిర్మాత అనే సంగతి అందరికి తెలుసు. జగపతి ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు జగపతిబాబు కూడా తండ్రిబాటలో నడుస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu