HomeTelugu Newsపవన్ పెద్ద స్టార్ అవుతారని అసలు ఊహించలేదు: సుప్రియ

పవన్ పెద్ద స్టార్ అవుతారని అసలు ఊహించలేదు: సుప్రియ

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పవన్ కళ్యాణ్ తొలి సినిమాలో నాగార్జున మేనకోడలు సుప్రియ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 22 ఏళ్ళు అయింది. ఆ సినిమా తరువాత మరో సినిమాలో నటించలేదు సుప్రియ. అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన పనులు చూసుకుంటూ బిజీ అయిపొయింది. ఇప్పుడు తాజాగా గూఢచారి సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది సుప్రియ. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. నదియా ఖురేషి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సుప్రియ నటనను అనేక మంది సెలబ్రిటీలు మెచ్చుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారట.

5 3

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రియ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సుప్రియ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద స్టార్ అవుతారని అసలు ఊహించలేదని..ఫస్ట్ ఫిల్మ్ సమయంలో పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదని చెప్పింది. ఇప్పటికి పవన్ కళ్యాణ్ తనను హీరోయిన్ గానే గుర్తుపెట్టుకున్నారని చెప్పింది సుప్రియ. మంచిపాత్రలు వస్తే తప్పకుండా నటిగా జర్నీని కంటిన్యూ చేస్తానని చెప్తున్నది. నెగెటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ అంటే ఇస్తామని ఆ తరహా పాత్రలు వస్తే అసలు వదిలిపెట్టమని తన మనసులోని మాటను బయటపెట్టింది సుప్రియ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu