ప్రపంచ దేశాల్లో ట్రేండింగ్‌ అవుతున్న రోబో 2 పాయింట్ టీజర్

నిన్న వినాయక చవితి సందర్భంగా రోబో 2 పాయింట్ ఓ టీజర్ రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా టీజర్ రిలీజ్ కావడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. టీజర్ రిలీజైన 24 గంటల్లోనే యూట్యూబ్లో 24.8 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నది. ఇప్పటికి యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతున్నది. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలోని 30 దేశాల్లో ఈ టీజర్ ట్రేండింగ్ అవుతున్నది.

ఇండియా తో పాటు బాంగ్లాదేశ్, యూఏఈ, నేపాల్, ఖతార్, మలేషియా, జపాన్ వంటి దేశాల్లో ట్రేండింగ్ అవుతున్నది. ఆసియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 29 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వర్క్స్ కోసమే రూ.540 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచంలోని బెస్ట్ విజువల్ ఎఫక్ట్ కంపెనీలకు చెందిన 3000 మంది ఈ సినిమా కోసం పనిచేశారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు.