HomeTelugu Newsప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్‌..!

ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్‌..!

ప్రియాంక చోప్రా.. నీకీ జోనస్ ప్రేమ వ్యవహారం చాలా రోజుల నుంచి ట్రెండ్‌గా మారుతుంది. కానీ ప్రియాంక మాత్రం ఈ విషయం పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎంగేజ్మెంట్ విషయాన్ని ఎందుకని అంత గోప్యంగా ఉంచుతున్నదో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఆంగ్ల పత్రికలు ప్రియాంక ఎంగేజ్మెంట్‌ అయినట్టుగా కథనాలు వచ్చినా.. నో కామెంట్‌ అంటూ.. ఇది నా సొంత విషయం అని పబ్లిక్‌ కు చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది. సల్మాన్‌ ఖాన్‌ భారత్‌ సినిమా నుంచి బయటకు రావడంతో.. ప్రియాంకపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

7 14

ఇటీవలే ప్రియాంక చోప్రా, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీకి హాజరైంది. 1990 ప్రాంతంలో టాప్ హీరోయిన్ గా పాపులరైన రవీనా టాండన్ తో కలిసి సెల్ఫీ దిగింది. ఈ ఫోటోను రవీనా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఫొటోలో ప్రియాంక వెలికి ఖరీదైన ఎంగేజ్మెంట్ ఉంగరం ఉంది. ప్రియాంక పుట్టినరోజున నికి జోనస్ ఈ రింగ్ తొడిగినట్టుగా మీడియా వర్గాల సమాచారం. ఈ ఉంగరం ధర ఇంచుమించుగా రూ.2 కోట్ల వరకు ఉంటుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu