భీమవరంలో కేఏ పాల్‌ నామినేషన్‌ తిరస్కరణ

ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ నామినేషన్‌ను తిరస్కరించారు రిటర్నింగ్ అధికారులు. ఇప్పటికే నర్సాపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన… ఇవాళ భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే, నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌ వేయడానికి ఆలస్యంగా వచ్చారంటూ నామినేషన్‌ తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, అధికారులపై మండిపడ్డారు కేఏ పాల్.. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు కుట్ర పన్నారని పాల్ ఆరోపించారు. తాను గెలుస్తానన్న భయంతో భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని విమర్శించిన పాల్… నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచి నేనేంటో చూపిస్తానని సవాల్ చేశారు.