HomeTelugu Big Storiesబయోపిక్ మొదలుకానుంది!

బయోపిక్ మొదలుకానుంది!

తెలుగుజాతి గర్వించే నటుడు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకూండా రాజకీయాల్లో చేరి ప్రజలకు తనవంతు సేవలు చేసాడు. ఈ మద్య సినీ, రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చకున్న వారి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆదారంగా ‘మహానటి’ సినిమా తీస్తున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మద్య ఎన్టీఆర్ బయోపిక్ పై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి.ntr 1 1వాటన్నింటికి ఖండిస్తూ.. డైరెక్టర్ తేజ తాజాగా ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌పై తీయనున్న బయోపిక్‌కు ముహుర్తం తేదీని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాను గురువారం (మార్చి 29) ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా హాజరు కానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu